ఆర్టీసీ కార్మికుల ఐదో రోజు సమ్మెకు మద్దతుగా మహబూబాబాద్‌లో సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. సీపీఎం కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. చేరుకుంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రపన్నుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ఆరోపించారు. సకల జనుల సమ్మె సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కేసీఆర్, నేడు కార్మికుల సమ్మెను పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వంలో విలీనం చేయాలని లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్ఐ నిందితులు