మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకర బోడు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం తవ్విన గుంతను పూడ్చాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో గుంత ఉండటం వలన విద్యార్థులు అందులో పడే అవకాశం ఉందని సీపీఐ నాయకుడు అజయ్ సారధి పేర్కొన్నారు. ట్యాంక్ నిర్మాణం కోసం గుంతను తవ్వి, పూర్తి చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని, లేదంటే గుంతను పూడ్చాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : ఎన్నికల ప్రక్రియ గడువు ఎందుకు తగ్గించారు?: హైకోర్టు