మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం టేకుల తండాలో విషాదం చోటుచేసుకుంది. రైతు దుక్కి దున్ని మేత కోసం ఆవులను వదిలిపెట్టాడు. నీళ్లు తాగేందుకు ఏరులోకి వెళ్లిన ఆవులు... విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే గిలగిలా కొట్టుకుని మృతి చెందాయి. కళ్లముందే కన్నబిడ్డలాంటి ఆవులు చనిపోతే ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. వారి రోదనలు అందరిని కన్నీరు పెట్టించాయి.
ఇవీ చూడండి: లష్కర్ బోనాలకు ఏర్పాట్లు పూర్తి