ETV Bharat / state

'గాలికుంటు ఇంజెక్షనే నా ఆవును చంపింది'

గాలికుంటు వ్యాధి నివారణకు పశు వైద్యులు చేసిన ఇంజెక్షన్లు వికటించి ఓ ఆవు మృతిచెందగా, మరికొన్ని పశువులు అనారోగ్యం పాలయ్యాయని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

cow dead by the vaccination effect in mahabubabad
'గాలికుంటు ఇంజెక్షనే నా ఆవును చంపింది'
author img

By

Published : Feb 19, 2020, 1:00 PM IST

పశువులు గాలికుంటు వ్యాధి బారిన పడకుండా గోపాల మిత్ర ఆధ్వర్యంలో మహబూబాబాద్​ జిల్లా బలరాంతండా గ్రామంలో ఈ నెల 14న పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గ్రామంలో ఉన్న పశువులకు టీకాలు వేశారు. గ్రామానికి చెందిన బానోత్ సునీతకు చెందిన జెర్సీ ఆవు 18న మృతి చెందింది.

ఆవుకు టీకా వేసినప్పటి నుంచి మేత తినలేదని, నీరు కూడా తాగలేదని, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఆవు మృతి చెందిందని ఆవు యజమానురాలు సునీత ఆవేదన వ్యక్తం చేసింది. ఆవు మృతికి కారణమైన పశు వైద్యులపై చర్యలు తీసుకుని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని సునీత వేడుకుంది.

టీకా వేయడం వల్ల పశువులు మృతి చెందవని, మహబూబాబాద్ మండలంలో 1000 పశువులకు టీకాలు వేశామని, ఒక పశువు మృతి చెందిందని ఆరోపించడం తగదని పశువైద్యాధికారి రాజేశ్​ రెడ్డి అన్నారు.

'గాలికుంటు ఇంజెక్షనే నా ఆవును చంపింది'

ఇదీ చూడండి : జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.