ETV Bharat / state

కలెక్టరేట్​లో కొవిడ్​19 కంట్రోల్​రూమ్​ ఏర్పాటు - జిల్లా పాలనాధికారి గౌతమ్

కరోనా నివారణ చర్యల్లో భాగంగా మహబూబాద్​ జిల్లా కలెక్టరేట్​లో కొవిడ్​ 19 కంట్రోల్​ రూమ్​ను జిల్లా పాలనాధికారి గౌతమ్​ ప్రారంభించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉండకుండా బయట తిరిగినా.. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించినా స్థానికులు వెంటనే కంట్రోల్​ రూమ్​కు తెలియజేయాలని ఆయన సూచించారు.

covid-19 control room inauguration by mahabubabad collector goutham
కలెక్టరేట్​లో కొవిడ్​19 కంట్రోల్​రూమ్​ ఏర్పాటు
author img

By

Published : Mar 24, 2020, 10:06 AM IST

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్​లో కొవిడ్ 19 కంట్రోల్ రూమ్​ను జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డిలు ప్రారంభించారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు సుమారు 100 మంది ఉన్నారని ఆయన తెలిపారు. వారు 14 రోజులపాటు గృహ క్వారంటైన్​లోనే ఉండాలని, బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన వారు బయటకు వస్తే.. స్థానికులు అధికారులకు తెలియజేయాలని, కరోనా లక్షణాలు కనపడినా.. కంట్రోల్​రూమ్​కు సమాచారం అందించాలని జిల్లా పాలనాధికారి కోరారు.

జనతా కర్ఫ్యూను జిల్లా ప్రజలు విజయవంతం చేశారని, అదే విధంగా ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయని, అనంతరం మూసివేస్తారని ఆయన వెల్లడించారు. సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అన్ని దుకాణాలు మూసివేయాలని, ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కలెక్టరేట్​లో కొవిడ్​19 కంట్రోల్​రూమ్​ ఏర్పాటు

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా లాక్​డౌన్​... కరోనా కేసులు@471

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.