మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంబాల చెరువుకు ఎఫ్టీఎల్ హద్దులను నిర్ణయించాలని వార్డ్ కౌన్సిలర్ రవి కలెక్టర్ గౌతమ్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రతి ఏడాది చెరువులో నుంచి మట్టిని తీసి శిఖం భూములలో పోసి ఎత్తు పెంచుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణంలోని చెరువుల భూములు అన్యాక్రాంతం కాకుండా ట్రెంచులు కట్టించాలని రవి విజ్ఞప్తి చేశారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: Rave Party: కడ్తాల్ పరిధిలో రేవ్‌పార్టీ.. 10 మంది అరెస్ట్