మహబూబాబాాద్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 36వ వార్డులో పేదలను వార్డు కౌన్సిలర్ నీరజ ధర్మన్న ఆదుకున్నారు. మంగళవారం ప్రతి ఇంటికి తిరుగుతూ... సుమారు మూడు వందల కుటుంబాలకు ఆరు రకాల కూరగాయలను అందజేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తనకు చేతనైన చిరు సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చేందుతున్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. లాక్డౌన్కు అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి, మాజీ కౌన్సిలర్ రామ్మూర్తి, ఉప్పల రంగా, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడంలో చైనా దూకుడు!