మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వైద్య సిబ్బంది ధర్నాకు దిగారు. తమను పర్మినెంట్ చేయాలని.. వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని.. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు.
తాము గత పది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ వరాలు ఇస్తున్నారని, అదేవిధంగా తమకూ న్యాయం చేయాలని కోరారు. ఏ నెల జీతం ఆ నెల వచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: స్నేహానికి గుర్తుగా గిఫ్ట్ పంపించానని లక్షలు లాగేశాడు