పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని పెట్రోల్ బంక్ ముందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో లీటర్ పెట్రోల్ రూ. 50, 60 ఉండగా, కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాకా రూ. 100 దాటిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి విమర్శించారు. పెంచిన పెట్రోల్.. డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: షర్మిలకు చుక్కెదురు.. కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు..!