ఖమ్మం - వరంగల్ - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ వామపక్ష పార్టీల అభ్యర్థి జయ సారథి రెడ్డి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రచారం నిర్వహించారు. స్టేడియంలో ఉదయం నడకకు వచ్చిన వారందరినీ కలిసి స్థానికుడైన తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.
మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం అందరితో కలిసి క్రికెట్ ఆడారు.
ఇవీ చదవండి: 'బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే వరకూ పోరాటం చేస్తా'