ETV Bharat / state

పలు గ్రామాల్లోని వైరస్​ నివారణ చర్యలను పరిశీలించిన కలెక్టర్​ - కలెక్టర్​ వీపీ గౌతమ్​

మహబూబాబాద్​ జిల్లా నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల్లో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్​ పర్యటించి తెలుసుకున్నారు. ప్రజలందరూ వైరస్​ పట్ల అవగాహన కలిగి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

collector vp goutham visit some villages in mahabubabad
పలు గ్రామాల్లోని వైరస్​ నివారణ చర్యలను పరిశీలించిన కలెక్టర్​
author img

By

Published : Apr 9, 2020, 10:39 AM IST

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ పర్యటించారు. తొలుత పడమటిగూడెంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య పనుల నిర్వహణ, రసాయనాల పిచికారీకి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం మంచ్యాతండాలో స్వీయ నిర్బంధంలో ఉంచిన ఒకరు బయటకు వెళ్లడం తెలుసుకున్న కలెక్టర్​ అసంతృప్తి వ్యక్తంచేశారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకుంటూ.. భౌతిక దూరం పాటించాలని ప్రజలకు ఆయన సూచించారు. అనంతరం నర్సింహులపేట మండల పరిషత్తు కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి: తగ్గుతున్న వాయుకాలుష్యం.. తేటపడుతున్న నగరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.