మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాలో 6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణానికి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు శంకుస్థాపన చేశారు.
జిల్లా పరిషత్ నుంచి మంజూరైన నిధుల్లో ఎక్కువ భాగం బయ్యారం మండలానికే కేటాయిస్తున్నామని ఆమె చెప్పారు. ఎక్కువ నిధులు కేటాయించి బయ్యారం మండలంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుమారి, చేపూరి మౌనిక, ఎంపీడీఓ చలపతిరావు, తెరాస నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'ఊరేగింపు ఆపండి... మీ భార్య నేను ప్రేమించుకున్నాం'