ETV Bharat / state

కరోనా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్​ - బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం సర్పంచ్ షఫియొద్దీన్

కరోనా... బంధాలను బంధుత్వాలను దూరం చేస్తుంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తులను బంధువులు చివరి చూపు కూడా చూడడం లేదు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకుండా ముఖం చాటేస్తున్నారు. కన్నవారే....కాటికి రాని ఈ రోజుల్లో గ్రామ సర్పంచ్​ అన్నీ తానై అంత్యక్రియలు జరిపించారు.

brahmanapalli laxmipuram sarpanch hold funeral for man died with corona
కరోనా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్​
author img

By

Published : Dec 14, 2020, 12:12 PM IST

మహబూబాబాద్ జిల్లా బ్రహ్మణపల్లి లక్ష్మీపురంలో ఓ వ్యక్తికి నెల రోజుల క్రితం కరోనా సోకి ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. బంధుమిత్రులెవరూ మృతదేహం వద్దకు రాలేదు.

గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి సర్పంచ్​ షఫియొద్దీన్​... మృతదేహాన్ని ట్రాక్టర్​లో స్వయంగా స్మశానవాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.

కరోనా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్​

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 384 కరోనా కేసులు, 3 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.