ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 70వ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హల్లో ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దానిని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, భాజాపా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కలిసి ప్రారంభించారు.
మోదీ ఛాయ్‌వాలా నుంచి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదగడం ఎంతో గర్వకారణమని, అలాంటి కుమారుని జన్మనిచ్చిన ఆ తల్లి ఎంతో అదృష్ట వంతురాలని... ఈ రోజు దేశ ప్రజలకు పండుగ వాతావరణం అన్నారు. ముద్ర కోపరేటివ్ బ్యాంకు సహకారంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి: ఎల్‌ఆర్‌ఎస్ జీవో సవరించి విడుదల చేస్తాం : కేటీఆర్