మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ యువకుడిని బ్లాక్ ఫంగస్ అనుమానంతో హైదరాబాద్ కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్‌కు తరలించారు. బయ్యారం మండలం బాల్యా తండాకు చెందిన ఈ యువకుడు కరోనా గురై జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
కొవిడ్ నుంచి కోలుకున్న మూడు రోజులకే కుడి కన్ను కొద్దిగా వాపు రాగా... ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. ఇంఛార్జ్ డాక్టర్ సతీష్‌ను సంప్రదించారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో కోఠి ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ఉద్ధృతి తగ్గుతున్నా.. లాక్డౌన్ బాటలోనే రాష్ట్రాలు!