కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ఇళ్లవద్దే నిర్వహించుకోవాలని మహబూబూబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. బతుకమ్మల నిమజ్జనం కోసం సామూహికంగా చెరువుల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. దుర్గామాత విగ్రహాలను బయట ప్రతిష్టించేందుకు సైతం అనుమతి లేదని.. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దుర్గామాత విగ్రహాలను ఇళ్లు, దేవాలయాలనందు ప్రతిష్టించుకోవాలని సూచించారు. బతకమ్మ వేడుకలను తక్కువ మందితో, వారి వారి వీధుల్లోనే నిర్వహించుకోవాలన్నారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి.. జీహెచ్‌ఎంసీలో ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత