ETV Bharat / state

మహబూబాబాద్​లో డోర్​ డెలివరీపై అవగాహన ర్యాలీ - lockdooen

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్​ డోర్​ డెలివరీ విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఇక నుంచి ఉదయం 6 గంటల నుంచి 11 వరకే దుకాణాలు తెరిచి ఉంచుతారు. 11 గంటల తర్వాత ఏ వస్తువు కావాలన్న డోర్​ డెలివరీ ద్వారా తెప్పించుకోవాలని అధికారులు సూచించారు. దీనిపై పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

awareness rally
అవగాహన ర్యాలీ
author img

By

Published : Apr 12, 2020, 10:04 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు మహబూబాబాద్​ కలెక్టర్​ వీపీ గౌతమ్​ డోర్​ డెలివరి విధానానికి మెగ్గు చూపారు. 1200 మంది వాలంటీర్లను నియామకం చేసి.. ప్రజలకు అవసరమైన వస్తువులను డోర్ డెలివరీ ఇవ్వాలని నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి 11 వరకే తమకు అవసరమైనవి తీసుకునేందుకు ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావాలని సూచించారు. 11 గంటల తర్వాత మందుల షాపులు తప్ప మిగతా దుకాణాలన్ని మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మహబూబాబాద్ పట్టణ ప్రజలు డోర్ డెలివరీని ఉపయోగించుకోవాలని ప్రజా హృదయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. కరోనాకు మందు లేదని, సామాజిక దూరం ఒక్కటే మార్గమన్నారు. ఎలాంటి అవసరమున్న వాలంటీర్లతో కావాల్సిన వస్తువులను తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: వెళ్లలేరు.. ఉండలేరు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.