మహబూబాబాద్ జిల్లా మరిపెడ, దంతాలపల్లి మండలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పర్యటించారు. తొలుత మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెంలోని తమ బంధువులైన తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్ ఇంటికి వెళ్లారు.
వారి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా మాట్లాడారు. కాసేపు అక్కడే గడిపారు. అనంతరం దంతాలపల్లి మండలం ఆగాపేటలో మరో బంధువు, తెరాస నేత నూకల గౌతంరెడ్డి ఇంటికి చేరుకున్నారు. గౌతం రెడ్డి దగ్గరి బంధువులు కావడం వల్ల కాసేపు అక్కడే సేద తీరారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైదరాబాద్కు బయలు దేరి వెళ్లారు.
ఇదీ చూడండి: Rythu Bandhu: రైతు బంధు కోసం నిధుల సమీకరణలో ప్రభుత్వం