సీఏఏకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు మొహతరమా ఆయిషా సుల్తానా సాహెబ్ అన్నారు. మహబూబాబాద్‌లోని షాదీఖానాలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీఆర్, ఎన్ఆర్సీపై జరిగిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారత్‌లోనే పుట్టామని ఆఖరి శ్వాసను ఈ దేశంలోనే విడుస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి 8, 14, 15, 21 అధికరణలు విరుద్ధంగా ఉన్నాయన్నారు.