మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమంతునిగడ్డ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు నీటి ఎద్దడిని నివారించేందుకు తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాడు. తన పుట్టిన రోజు సందర్భంకా కేకులు కట్ చేసి దుబారా ఖర్చు చేయకుండా ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వాసవి సేవా ట్రస్ట్ చేస్తున్న ప్రచారానికి ఆకర్షితుడై ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మాణాన్ని ప్రారంభించాడు.
బంధువులు, స్నేహితుల అభినందన
చుట్టుపక్కలవారు, బంధు మిత్రులంతా శ్రీనివాస్‌ను అభినందించారు ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజున ఆడంబరాలకు పోకుండా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
శ్రీనివాస్ తరహాలోనే మిగతా వారు కూడా జల సంరక్షణకు పూనుకుంటే రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి సమస్యను అధిగమించడం సులువవుతుంది.
- ఇదీ చూడండి : కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద రాజ్‌నాథ్ నివాళి