ETV Bharat / state

'భారీ భద్రత నడుమ.. పోలింగ్‌కు సర్వం సిద్ధం' - వెబ్ కాస్టింగ్

జిల్లాలో ఆదివారం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఎన్నికల సామాగ్రిని నిల్వ చేసిన సాంఘీక సంక్షేమ బాలికల కళాశాలను ఎస్పీ కోటిరెడ్డితో కలిసి ఆయన సందర్శించారు.

Amid heavy security .. everything is ready for mlc elelctions polling in mahabubabad
'భారీ భద్రత నడుమ.. పోలింగ్‌కు సర్వం సిద్ధం'
author img

By

Published : Mar 12, 2021, 9:32 PM IST

రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఎన్నికల సామాగ్రిని నిల్వ చేసిన సాంఘీక సంక్షేమ బాలికల కళాశాలను ఎస్పీ కోటిరెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. పోలింగ్ బాక్సులను, ఇతర సామాగ్రిని పరిశీలించారు.

జిల్లాలోని 36, 633 ఓటర్లకు.. 53 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.​ పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రక్రియ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు కొనసాగుతుందని వివరించారు.

ఓటు వేసేందుకు వెళ్లే ప్రతి ఒక్కరూ కొవిడ్ నియమాలను పాటిస్తూ, మాస్కు ధరించి వెళ్లాలని కోరారు. 4 చెక్ పోస్టులతో పాటు.. 480 మంది సిబ్బందితో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇదీ చదవండి: కళాకారుల గొంతు ఇన్నేళ్లు మూగబోయింది: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.