ETV Bharat / state

చర్యలు తీసుకోకుంటే కారుణ్య మరణానికి అనుమతివ్వండి

మహబూబాబాద్​లో కారుణ్య మరణానికి అనుమతివ్వాలని ఓ వృద్ధురాలు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న  తనకు  తప్పుడు  వైద్యంతో మంచానికే  పరిమితం  చేసిన  వైద్యుడు సతీశ్​పై  చర్యలు తీసుకోవాలని కోరారు.

చర్యలు తీసుకోకుంటే కారుణ్య మరణానికి అనుమతివ్వండి
author img

By

Published : Aug 5, 2019, 11:57 PM IST

మహబూబాబాద్​ జిల్లా కేంద్రానికి చెందిన మట్టూరి సత్తెమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు జ్వరంతో బాధపడుతూ స్థానిక శ్రీ సాయి నర్సింగ్​ హోమ్​కు వెళ్లింది. అక్కడ సతీశ్​ అనే వైద్యుడు ఎలాంటి పరీక్షలు చేయకుండా పలు మందులు రాశాడు. వాటితో జ్వరం తగ్గకపోగా.. కాళ్లు, చేతులు, నడుము పడిపోయి మంచానికే పరిమితమయింది. వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు విన్నివించగా.. పాలనాధికారి ఐదుగురు డాక్టర్​లతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చినా.. సతీశ్ పై జిల్లా వైద్యాధికారి ఎలాంటి చర్యలు తీసుకోలేదని వృద్ధురాలు తెలిపంది. తక్షణమే వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తన కారుణ్య మరణానికి (మెర్సీ కిల్లింగ్​) అనుమతివ్వాలంటూ ప్రజావాణిలో దరఖాస్తు చేసింది.

చర్యలు తీసుకోకుంటే కారుణ్య మరణానికి అనుమతివ్వండి

ఇవీ చూడండి: శ్రమజీవుల బతుకులను చిదిమేసిన రోడ్డు ప్రమాదం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.