ETV Bharat / state

234 డైరెక్టర్‌ పదవులకు 925 నామినేషన్లు దాఖలు - సహకార సంఘాల్లో అధికారులు నామ పత్రాలు

మహబూబాబాద్​ జిల్లాలోని సహకార సంఘాలకు నిర్వహించనున్న ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ముగిసింది. ఈనెల 6 నుంచి 8 వరకు జిల్లాలోని 18 సహకార సంఘాల్లో అధికారులు నామ పత్రాలను స్వీకరించారు. 18 సంఘాల్లోని 234 డైరెక్టర్‌ పదవులకు 925 నామినేషన్లు దాఖలయ్యాయి.

925 nominations filed for 234 director posts at mahabubabad
234 డైరెక్టర్‌ పదవులకు 925 నామినేషన్లు దాఖలు
author img

By

Published : Feb 9, 2020, 11:18 AM IST

మహబూబాబాద్ జిల్లాలోని సహకార సంఘాల డైరెక్టర్‌ పదవులకు ఈ నెల 6 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. 18 సంఘాల్లోని 234 డైరెక్టర్‌ పదవులకు 925 నామినేషన్లు దాఖలయ్యాయి. 234 డైరెక్టర్ల పదవుల్లో 11 డైరెక్టర్ల స్థానాలకు ఒకటే నామినేషన్‌ దాఖలైంది వాటన్నింటిని ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు. ఈ నెల 9న నామపత్రాల పరిశీలన, 10న ఉపసంహరణల గడవు ముగిసిన తర్వాత పోటీలో ఎంత మంది సభ్యులు ఉంటారనేది స్పష్టం కానుంది.

అత్యధికంగా 82 మంది నామినేషన్లు

ప్రతి సంఘంలో 13 డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలను నిర్వహిస్తుండగా గూడూరు పీఏసీఎస్‌లో అత్యధికంగా 82 మంది నామినేషన్లు వేశారు. మన్నెగూడెం సహకార సంఘానికి తక్కువగా 31 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో సంఘాలవారీగా దాఖలైన నామినేషన్ల వివరాలను జిల్లా సహకార శాఖాధికారి ఇందిర వెల్లడించారు.

సంఘాల వారీగా నామినేషన్ల వివరాలు.. బయ్యారం 67, మన్నెగూడెం 31, డోర్నకల్‌ 61, గార్ల 46, గూడూరు 82, ధన్నసరి 53, కేసముద్రం 40, పొగుళ్లపల్లి 55, గుండ్రాతిమడుగు 41, కాంపల్లి 38, కురవి 40, మహబూబాబాద్‌ 61, మరిపెడ 43, నర్సింహులపేట 53, శ్రీరామగిరి 48, నెల్లికుదురు 58, ఎర్రబెల్లిగూడెం 33, తొర్రూరు 75 నామినేషన్లు దాఖలయ్యాయి.

పూర్తి చేయాలని..

సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో నిబంధనల మేరకు నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా సహకార శాఖాధికారి ఇందిర... రిటర్నింగ్‌ అధికారులను కోరారు. నామినేషన్ల చివరి గడువు రోజు శనివారం జిల్లా కేంద్రంలోని సహకార సంఘాన్ని ఇందిర ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల వివరాలను సేకరించారు. మూడు రోజులుగా వచ్చిన నామినేషన్ల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్‌ అధికారి జగన్మోహాన్‌రెడ్డి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి బీవీ ప్రసాద్‌, సీఈవో సిరాజుద్ధీన్‌ పాల్గొన్నారు.

234 డైరెక్టర్‌ పదవులకు 925 నామినేషన్లు దాఖలు

ఇదీ చూడండి : రాష్ట్రంలో 'సహకార' సందడి.. జోరుగా పార్టీల జోక్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.