మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 20 ఫీట్ల గొబ్బెమ్మను స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఆవిష్కరించారు. డాక్టర్ గుమ్మడవెళ్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గొబ్బెమ్మను స్థానిక డీఎస్పీ వెంకటరమణ ప్రారంభించారు. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాల్లో గోవు పేడతో గొబ్బెమ్మ ఏర్పాటు చేసి పవిత్రంగా భావించి పూజలు చేస్తారని తెలిపారు.
![20 feet tall gobbemma at thorrur in mahabubabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10258540_aa.png)
శ్రీ కృష్ణ పరమాత్మ ప్రతిరూపంగా భావించి పూజలు చేస్తామని తెలిపారు. గోవుల పరిరక్షణకు విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ కోసం ఈ గొబ్బెమ్మను తయారు చేయడం జరిగిందని తెలిపారు.
- ఇదీ చూడండి : 96 ఏళ్ల బామ్మ.. అదిరే ముగ్గేసెనమ్మ!