ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను యావత్ దేశం కొనియాడుతోందని... సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని కుమురం భీం జిల్లా కాగజ్ నగర్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయని... తెలంగాణ జాగృతి కుమురం భీం జిల్లా అధ్యక్షుడు పర్ష చంద్రశేఖర్ తెలిపారు. గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.20వేలు, రెండో బహుమతిగా రూ.10 వేల నగదుతో పాటు ట్రోఫీని అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: మూడో రోజు కొనసాగుతోన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర