ETV Bharat / state

తప్పు రాశావన్నందుకు సీసీ చెప్పుదెబ్బ.. వీవోఏ ఆత్మహత్యాయత్నం

ఓ మహిళా ఉద్యోగి పదిమందిలో తనను చెప్పుతో కొట్టిందనే అవమానంతో వీవోఏ ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో ఆగ్రహించిన తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. ఈ సంఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

Sandal blow in kumuram bheem
ఆసిఫాబాద్​లో సీసీ చెప్పుదెబ్బ
author img

By

Published : Mar 25, 2021, 5:46 PM IST

Updated : Mar 25, 2021, 6:48 PM IST

అవమానం భరించలేక వీవోఏ ఆత్మహత్యకు యత్నించిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన వీవోఏ రమేష్.. తమ శాఖకు చెందిన వాట్సప్ గ్రూప్​లో మహిళా సీసీని తప్పుగా ఏదో రాశారని అనడంతో వివాదం మొదలైంది. దీంతో గ్రూప్​లో చర్చ జరిగింది. మరుసటి రోజు జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకులో ఉన్న రమేష్ వద్దకు సీసీ వెళ్లి చెంపపై కొట్టిందని వీవోఏలు, కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

కొట్టిన మాట వాస్తవమే..

ఆందోళన స్థలికి చేరుకున్న సీసీ.. రమేష్​ ఆయనకు సంబంధం లేని విషయంలో అనవసరంగా తలదూర్చి తనను ఇబ్బంది పెట్టాడని ఆరోపించారు. అందుకే చెప్పుతో కొట్టానని తెలిపారు.

చర్యలు తీసుకోవాలని ఆందోళన

బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. వీవోఏ పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించిన సీసీపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వీవోఏలు డిమాండ్​ చేశారు. సమగ్ర విచారణ చేపట్టి, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'ఆలయానికి దారి అడిగాడు.. బంగారం లాక్కెళ్లాడు'

Last Updated : Mar 25, 2021, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.