కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని ఈదులవాడ గ్రామపంచాయతీ సర్పంచ్‌ను ఈదులవాడ గ్రామపంచాయతీ పరిధిలోని తెనుగుగూడ గ్రామస్థులు నిలదీశారు. పంచాయతీ నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలని తెనుగుగూడ వార్డు సభ్యుడు వెంకటేశ్వర్లు.. ఈదులవాడ సర్పంచ్ భీమేష్‌ను నిధుల ఖర్చు గురించి వివరాలు అడిగారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్ భీమేష్‌ను గ్రామపంచాయతీ నిధులను అభివృద్ధి పనులకు ఎందుకు వినియోగించడం లేదని నిలదీశారు.
అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు తెనుగు గూడ గ్రామ ప్రజలు నిరసన తెలిపారు. అధికారులు గ్రామాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. నిధుల వివరాలను పూర్తిగా వివరించాల్సిన బాధ్యత సర్పంచ్‌పై ఉన్నదని, నిధుల వినియోగం గురించి ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకపోవడం సరికాదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌గా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టకపోవడం సిగ్గుచేటని అన్నారు. నిధుల వినియోగం గురించి పూర్తి వివరాలు ప్రజలకు తెలిపి, గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.
ఇవీ చూడండి: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు