కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆదివాసీలు ధర్నా చేశారు. లంజన్ వీర గ్రామ శివారులోని ఏజెన్సీ భూములను మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడీలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వారిని ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు.
లంజన్ వీర గ్రామం వైపు ఆదివాసీలంతా ర్యాలీగా బయలుదేరగా... మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. అంతర్రాష్ట్ర రహదారిపై సుమారు మూడు గంటలపాటు ఆందోళన చేపట్టారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీలు రాస్తారోకో నిర్వహించారు. ఆదివాసీల నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఇదీ చూడండి: 'గల్లీలో చిందులు... దిల్లీలో విందులు..!'