కుమరం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరింగింది. తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు అందినకాడికి దోచుకెళ్లారు. గుంటూరు కాలనీకి చెందిన సూరిశెట్టి లింగయ్య శనివారం కుటుంబ సభ్యులతో కలిసి ముంబై వెళ్ళాడు. ఇవాళ ఉదయం తలుపులు తెరచి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రెండు గదుల్లో బీరువా లాకర్లు తెరిచారని, యజమానులు వచ్చాక ఎంత సొత్తు చోరీ అయింది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్