కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో దొంగతనం జరిగింది. ఎన్టీఆర్ చౌక్‌లోని ఆరాధన మద్యం దుకాణంలో రేకులతో ఉన్న పైకప్పును తొలగించి దొంగలు చోరీకి పాల్పడ్డారు.
ఈ ఘటనలో రూ.35 వేల నగదు చోరీకి గురైనట్లు షాపు నిర్వాహకులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఏఎస్పీ సుధీంద్ర, డీఎస్పీ స్వామి పరిశీలించారు.
ఇదీ చూడండి : ఇంటిల్లిపాదిని బలితీసుకున్న మద్యం