ETV Bharat / state

అటవీ సిబ్బంది చేతివాటం.. అక్రమార్కులకు బ్రహ్మాస్త్రం - అటవీ సిబ్బంది చేతివాటం.. అక్రమార్కులకు బ్రహ్మాస్త్రం

అధికారుల అక్రమాలతో అరణ్యాలు కరిగిపోతున్నాయి. మానులు మోడులైపోతున్నాయి. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నచందంగా అటవీ శాఖ సిబ్బంది అందినకాడికి కలపను అమ్మకుంటూ.. అక్రమార్కులకు సహకరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఒక్క రోజే ఆసిఫాబాద్ కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో నలుగురు అధికారులు సస్పెండ్​ అయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.

అటవీ సిబ్బంది చేతివాటం.. అక్రమార్కులకు బ్రహ్మాస్త్రం
author img

By

Published : Sep 28, 2019, 11:18 PM IST

అటవీ సిబ్బంది చేతివాటం.. అక్రమార్కులకు బ్రహ్మాస్త్రం

అటవీశాఖలో కొందరు సొంత సిబ్బందే అక్రమాలకు పాల్పడుతున్నారు. కలప అక్రమ రవాణాదారులకు సహకరించడమే కాక.. పట్టుబడిన కలపను తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. కింది స్థాయిలో పనిచేసే కొందరు అటవీ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే జిల్లా అటవీ ప్రాంతంలో విలువైన కలప తరిగిపోయింది. ఇటీవల కలప అక్రమ రవాణాపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం వల్ల అక్రమాలు కొంచెం తగ్గాయి. కానీ అక్కడక్కడా వెలుగుచూస్తూనే ఉన్నాయి. బెజ్జూర్ ఘటనతో ఇది తేటతెల్లమవుతోంది. ఒక్క రోజే ఆసిఫాబాద్ కాగజ్​నగర్ డివిజన్ పరిధిలో నలుగురు అధికారులు సస్పెండ్​ అవ్వడమే దీనికి నిదర్శనం.

కానలు కరిగిపోతున్నాయ్​...

ఆసిఫాబాద్ కాగజ్​నగర్ డివిజన్ పరిధిలో తిర్యాని, కాగజ్​నగర్, బెజ్జూర్, పెంచికల్పేట, చింతల మానేపల్లి, పరిధిలో దట్టమైన అడవులన్నాయి. బెజ్జూరు పరిధిలో కృష్ణ పల్లి, అంబగట్ట, పెద్ద సిద్ధాపూర్​లో విలువైన కలపకు నెలవులు. చింతలమానేపెళ్లి మండలం లోని గూడెం, కేతిని, అనుకోడా, ప్రాణహిత సరిహద్దు ప్రాంతంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. స్థానికులు తమ అవసరాలకు టేకుచెట్లు నరికేస్తున్నారు. కిందిస్థాయి సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల నరికిన దుంగల్లో కొంత మొత్తం అధికారులకు ముట్టజెబుతున్నారు. దీనితో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదే నిదర్శనం..

విధుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సొంత శాఖ లోనే ఉంటూ కలప దొంగలకు సహకరిస్తున్న వారిని సస్పెండ్ చేస్తున్నారు. బెజ్జూర్ పరిధిలో సెక్షన్ ఆఫీసర్ అక్రమంగా కలప నిల్వ చేయించినట్లు తేలడం వల్ల సస్పెండ్​ అయ్యారు. గతంలోనూ ఇదే డివిజన్ పరిధిలో కర్జెల్లీ రేంజిలో ఓ సెక్షన్ అధికారి సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని బీట్ సెక్షన్ అధికారులను సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం.. అక్రమ కలప రవాణా ప్రోత్సహించడం.. లాంటివి చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా అటవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు..

ఇదీ చూడండి: అడవి పల్లె అల్లంపల్లికి దారేది..?

Intro:filename:

tg_adb_37_10_adikarule_akramarkulu_story_vo_ts10034

Body:

అటవీశాఖలో కొందరు సొంత సిబ్బందే అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమ రవాణాను నిలువరించాల్సింది పోయి విధుల్లో అక్రమాలకు తెర లేపుతున్నారు. అవసరమైన చోట కలప అక్రమ రవాణా దారులకు సహకరించడమే కాక పట్టుబడిన కలప సైతం తమ సొంత అవసరాలకు వాడుకోవడం చేస్తున్నారు. అక్రమ కలప రవాణాకు సహకరిస్తూ కిందిస్థాయి సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కింది స్థాయిలో పనిచేసే కొంతమంది అటవీ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే జిల్లా అటవీ ప్రాంతంలో విలువైన కలప తరిగిపోయింది. ఇటీవల కలప అక్రమ రవాణా ఉన్నతాధికారులు దృష్టి సారించడంతో తగ్గు ముఖం పట్టింది. అయితే మళ్లీ కొంతమంది కిందిస్థాయి సిబ్బంది స్థానిక కలప అక్రమ రవాణాదారులకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. బెజ్జూర్ ఘటనతో ఇది తేటతెల్లమవుతోంది. కలప అక్రమ రవాణా మరింత ఆస్కారం ఏర్పడుతుంది. ఒక్క రోజే ఆసిఫాబాద్ కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో నలుగురు అధికారులు సస్పెన్షన్ కు గురి అవ్వడం ఇందుకు నిదర్శనం.

జిల్లాలోని ఆసిఫాబాద్ కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో తిర్యాని, కాగజ్నగర్, బెజ్జూర్, పెంచికల్పేట, చింతల మానేపల్లి, పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. బెజ్జురు పరిధిలో కృష్ణ పల్లి, అంబగట్ట, పెద్ద సిద్ధాపూర్ లలో విలువైన కలపతో దట్టమైన అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. వీటితోపాటు చింతలమానేపెళ్లి మండలం లోని గూడెం, కేతిని, అనుకోడాతో పాటు ప్రాణహిత సరిహద్దు ప్రాంతంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ విలువైన టేకు చెట్లు ఉండటంతో స్థానికులు తమ అవసరాల కోసం చెట్లను నరికి వేస్తున్నారు. కిందిస్థాయి సిబ్బంది సైతం చూసి చూడనట్లు వ్యవహరించడంతో నరికిన దొంగల్లో కొంత మొత్తంలో అధికారులకు చెపుతున్నారు. ఇక కొందరు కలప నరికేవాళ్ళు ఉన్నతాధికారులకు సహకారం అందిస్తున్నారని నెపంతో చెట్లను నరికివేసిన వారిపై పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. బెజ్జూర్ పరిధిలో కొంతమంది కలప అక్రమ రవాణా దారులను చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

అటవీశాఖలో విధుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఉన్నత అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సొంత శాఖ లోనే ఉంటూ కలప దొంగలకు సహకరిస్తున్న వారిని సస్పెండ్ చేస్తున్నారు. బెజ్జూర్ పరిధిలో సెక్షన్ ఆఫీసర్ అక్రమంగా కలప నిల్వ చేయించినట్లు తేలడంతో సస్పెన్షన్ కు గురయ్యారు. గతంలోనూ ఇదే డివిజన్ పరిధిలో లోని కర్జెల్లీ రేంజిలో ఓ సెక్షన్ అధికారి ని సస్పెండ్ చేశారు. అంతకుముందు ఇలాంటి ఆరోపణలతో సస్పెండ్ అయిన ఉద్యోగులు ఉన్నారు. శుక్రవారం అసిఫాబాద్ డివిజన్ పరిధిలోని బీట్ సెక్షన్ అధికారులను సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం.. అక్రమ కలప రవాణా ప్రోత్సహించడం.. లాంటివి చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా అటవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు..

బైట్:
01) వివి. ప్రసాద్

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.