కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఆరుగురితో వెళ్తున్న ఓ నాటు పడవ బోల్తా పడింది. ఘటనలో ఇద్దరు అటవీ సిబ్బంది గల్లంతయ్యారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.
కాగా పడవలో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఇద్దరు పడవ నడిపేవారు, ముగ్గురు అటవీ సిబ్బంది, ఒక ప్రయాణికుడు ఉన్నట్లు సమాచారం. అందులో అటవీ సిబ్బంది ముంజం బాలకృష్ణ, సురేశ్‌ల ఆచూకీ లభించలేదు. వీరు కర్జవెల్లి అటవీ క్షేత్రంలో పనిచేస్తున్నారు. కూరగాయలు కొనేందుకు గూడెం నుంచి అవతలి తీరం వైపు గల మహారాష్ట్రలోని అహేరీ గ్రామానికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: శంషాబాద్ నిందితులను పట్టించిన ఫోన్ కాల్