కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీఎం పరిశ్రమ మూతపడిన నాలుగేళ్ళ తర్వాత 2018 ఆగస్టు 2న పునఃప్రారంభం అయింది. కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెరాస ప్రభుత్వం పలు రాయితీలు కల్పించగా జేకే యాజమాన్యం పరిశ్రమను ప్రారంభించింది. అయితే ప్రారంభ సమయంలో యాజమాన్యం పరిశ్రమ కార్మికులను దశల వారిగా విధులకు తీసుకుంటామని తెలిపింది. కానీ పరిశ్రమ ప్రారంభమై రెండేళ్లు కావస్తున్నా కార్మికులను విధుల్లోకి తీసుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులను ఎందుకు విధుల్లోకి తీసుకోవడం లేదని ప్రశ్నిస్తే మిమ్మల్ని విధుల్లోకి తీసుకోము, కావాలంటే రాజీనామా చేయండి అంటున్నారని కార్మికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక హక్కులకోసం పోరాడాలని నిర్ణయించుకున్నామని, అందుకోసం రాజకీయ పార్టీల మద్దతు కోరామని కార్మికులు తెలిపారు. కార్మికుల హక్కుల పోరాటంలో ప్రతిపక్ష నాయకులుగా తమవంతు మద్ధతు అందిస్తామని, కార్మికులకు అండగా ఉంటామని పలు పార్టీల నేతలు తెలిపారు.
ఇదీ చదవండి: దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్