కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. పోతేపల్లిలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో నిన్న అర్ధరాత్రి కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపడుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు.
గ్రామస్థుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బికాస్ గరామి, శంబు మండల్, రామకృష్ణ పాల్, కృష్ణ గుప్తా, హసన్మండల్, దిలీప్ బిశ్వాస్, నిమంసు మండల్, శంకర్ సర్కార్లను అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరైన బికాస్ గరామి నగర్ ఎంపీటీసీగా ఉన్నారు.
నిందితుల నుంచి రూ.22 వేల నగదు, 8 చరవాణులు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇవీచూడండి: ఆడపిల్ల పుట్టిందని... పక్కనోళ్ల పిల్లాడిని ఎత్తుకెళ్లాడు!