ఇవీ చూడండి: హైదారాబాద్ ఎంఎంటీఎస్‌కు 16 ఏళ్లు
ఈ బడిలో చదవాలంటే గొడుగు ఉండాల్సిందే - గొడుగు
సాధారణంగా చదువుకోవాలంటే పెన్నులు.. పుస్తకాలు.. కావాలి. కానీ కుమురం భీం జిల్లాలోని ఈ పాఠశాలలో గొడుగు కూడా కావాలి. 33 మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వర్షం కారణంగా గొడుగు కింద చదువుకుంటున్నారు.
ఈ బడిలో చదవాలంటే గొడుగు ఉండాల్సిందే
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం గువ్వలం గూడెం ప్రభుత్వ పాథమిక పాఠశాలలో విద్యార్థులకు గొడుగు ఉంటేనే విద్యనభ్యసించే పరిస్థితి వచ్చింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 33 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఏ వైపు చూసినా తరగతి గదుల్లో పైనుంచి వర్షం కురుస్తుండటం వల్ల పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూత్ర శాలలు కూడా సరిగా లేవని విద్యార్థులు తెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న ఈ పాఠశాలలో విద్యార్థులు కింద కూర్చోలేని పరిస్థితి. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినాలంటే గొడుగు పట్టుకొవాల్సిందే. అన్నం తినడానికి కూడా గొడుగు ఉండాలని విద్యార్థులు తెలిపారు. రెండేళ్లుగా ఈ పరిస్థితితో చదువుకోలేక పోతున్నామని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనం నిర్మించి సుమారు 20 ఏళ్లు కావోస్తుందని.. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: హైదారాబాద్ ఎంఎంటీఎస్‌కు 16 ఏళ్లు
Intro:filename:
tg_adb_07_08_kurusthunna_taragathi_gadhulu_ibbandullo_vidhyardulu_pkg_ts10034
Body:కుమురం భీం జిల్లా
కాగజ్ నగర్ మండలం
గొడుగుంటేనే చదువు...
()సాధారణంగా చదువుకోవాలంటే పెన్నులు.. పుస్తకాలు.. కావాలి.. కానీ ఆ పాఠశాలలో మాత్రం వీటితోపాటు గొడుగు కూడా ఉండాలి... గొడుగు కావాలి అంటే ఇంటి నుండి వచ్చేటప్పుడు తడవకుండా ఉండేందుకు కాదు.. తరగతి గదిలో పాటలు వినేటప్పుడు తడవకుండా ఉండేందుకు...
VO...01
ఇది కొమరం భీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలం జంబుగ పంచాయతీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో ప్రస్తుతం 33 మంది విద్యార్థులు 1నుండి 5వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. మూత్ర శాలలు కూడా సరిగాలేవు. వర్షాకాలం కావడంతో తరగతి గదుల్లో కురుస్తుంది. ఏవైపు చూసిన పైనుండి నీరు కురుస్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
VO...02
33 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు గల ఈ పాఠశాలలో వర్షాకాలం వచ్చిందంటే చాలు కష్టాలు మొదలైనట్లే. వర్షాకాలం గదులు మొత్తం కురుస్తుండడంతో విద్యార్థులు క్రింద కూర్చోలేని పరిస్థితి. ఒకవైపు పైన కురుస్తుంటే మరోవైపు కింద కూర్చోలేక ఇబ్బంది పడుతున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుందో గొడుగు పట్టుకొని చదువుకోవాల్సిన పరిస్థితి. రెండేళ్లుగా ఇదే పరిస్థితి అని ఉపాధ్యాయులు చెబుతుంటే తరగతి గదుల్లో కురుస్తుంటే చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.
VO...03
పాఠశాల భవనం నిర్మించి దాదాపు 20 ఏళ్ళు కావస్తుందని, ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలం పాఠశాలలో కురుస్తుండటంతో కొంతమంది విద్యార్థులు పాఠశాలకు రాలేకపోతున్నారని తెలిపారు. పాఠశాలలో మూత్రశాలలు సైతం సరిగా లేవని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.
బైట్స్:
01) నాజిమ అంజూమ్(5వ తరగతి విద్యార్థిని)
02) లోకేశ్వర్ (4వ తరగతి విద్యార్థి)
03) బుర్స రంగయ్య (స్థానికుడు)
04) ఠాకూర్ మహావీర్ సింగ్ (స్థానికుడు)
Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641