కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో నవంబర్ 24న జరిగిన సమత సామూహిక అత్యాచారం, హత్య కేసు విచారణ ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టులో జరుగుతోంది.
డిసెంబర్ 16న పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయగా... డిసెంబర్ 23 నుంచి సాక్షుల విచారణ ప్రారంభమైంది. మంగళవారంతో మొత్తం 25 మంది సాక్షులను కోర్టు విచారించింది. తదుపరి విచారణను జనవరి మూడో తేదీకి వాయిదా వేసింది.
సంక్రాంతి సెలవులకంటే ముందే తీర్పు వెలువడే అవకాశం ఉందంటున్న ప్రాసిక్యూషన్ న్యాయవాది రమణారెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి...