బస్సు డ్రైవర్‌కు మూర్ఛ.. తప్పిన పెను ప్రమాదం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇంద్రానగర్ జాతీయ రహదారిపై కాగజ్ నగర్ వెళ్తున్న మంచిర్యాల డిపో బస్సుకు పెనుప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్ గణేశ్‌కు మూర్ఛ రావడం వల్ల అందులో ప్రయాణిస్తున్న విశ్రాంత డ్రైవర్ యూసఫ్ బస్సును చాకచక్యంగా అదుపు చేశారు. బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది.
రెబ్బెన మండలం గోలేటి లో ఒక వివాహానికి వెళ్తున్న జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ కోవా లక్ష్మి ఈ సంఘటనను గమనించారు. బస్సు డ్రైవర్ గణేశ్‌ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రిటైర్డ్ డ్రైవర్ యూసఫ్‌తో బస్సులోని ప్రయాణికులను కాగజ్ నగర్‌కు సురక్షితంగా చేరవేశారు.
ఇదీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?