కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 31వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఏఎస్పీ వై.వి.యస్ సుధీంద్ర, డీటీఓ శ్యాం నాయక్ తదితరులు హాజరయ్యారు. ఎఎస్పీ సుధీంద్ర మాట్లాడుతూ.. రహదారి భద్రత అందరి బాధ్యత అన్నారు. ఒక్క క్షణంలో జరిగే ప్రమాదం కొన్ని జీవితాలపై ప్రభావం చూపుతుందని అన్నారు.
ఇవీ చూడండి: అశ్లీల వీడియోలు చూపించే... ఆ సార్ మాకొద్దు..!