30కుటుంబాలకు నిత్యవసర సరుకులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుమురం భీం జిల్లా సార్సాల దాడి ఘటనలో జైలుపాలైన వారి కుటుంబాల ధీన స్థితిపై ఈటీవీ భారత్లో ప్రసారమైన కథనానికి భాజపా నాయకులు రావి శ్రీనివాస్ స్పందించారు. జైలు పాలైన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంటిల్లిపాది జైలుకెళ్లి ఒంటరిగా ఉంటున్న బాలిక లక్ష్మీని ఓదార్చారు. కంటి చూపు సరిగా లేని తల్లికి సపర్యలు చేస్తున్న చిన్నారి స్వప్న బాగోగులు తెలుసుకున్నారు. జైలుకెళ్లిన 30 కుటుంబాల సభ్యులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కేసులో అమాయక రైతులు ఇరుక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : ప్రగతినగర్‌లో చిరుత కలకలం