కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రోజు నుంచి పదో తేదీ వరకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా జడ్పీ ఛైర్మన్ కోవా లక్ష్మి ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఉచితంగా 12కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ బియ్యం తీసుకున్నారు. ప్రతి రోజు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు టోకెన్ల ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండీ... హైదరాబాద్‌లో 'దిల్లీ' కుదుపు.. జమాత్‌కు వెళ్లొచ్చిన వారే కారణం