ETV Bharat / state

ప్రియుడితో కలిసి భర్తను ఖతం చేసింది.. - CRIME NEWS IN TELANGANA

15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న భర్తను భార్యే మట్టుబెట్టింది. ఈ ఘనకార్యానికి తన ప్రియుని సాయం తీసుకుంది. ఈ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే చేధించారు.

RALLAGDDA MURDER CASE SOLVED IN ONE DAY
author img

By

Published : Nov 20, 2019, 11:20 AM IST

కుమురం భీం జిల్లా దహేగం మండలం రాళ్లగూడలో జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లో చేధించారు. కౌటాల మండలానికి చెందిన రౌతు బండుకు, దహేగాం మండలం రాళ్లగూడాకు చెందిన కవితతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. బండు ఇళ్లరికం అల్లుడుగా వచ్చి రాళ్లగూడలోనే ఉంటున్నాడు. వీరికి ఏడేళ్ల పాప ఉంది.

కాగజ్​నగర్ మండలం బురదగూడకు చెందిన బిక్కుతో కవిత ఏడాది కాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయంపై కవితను భర్త తరచూ నిలదిసేవాడు. తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడు బిక్కుతో కలిసి భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది.

పథకం ప్రకారం ఆదివారం రాత్రి.... భర్త నిద్ర పోయాక ప్రియుడిని ఇంటికి రమ్మని కబురు పెట్టింది. రౌతుబండును కర్రతో బలంగా తలపై మోది చంపేశారు. మృతదేహాన్ని అదే రాత్రి... ద్విచక్రవాహనంపై కొత్మిర్ గ్రామ సమీపంలోని పత్తి చేనులో పడవేసి వెళ్లిపోయారు.

ప్రియుడితో కలిసి భర్తను ఖతం చేసింది..

మృతదేహాన్ని గమనించి గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకుని రిమాండుకు తరలించారు. 24 గంటల్లో కేసును చేధించిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు

Intro:filename

tg_adb_24_19_hathya_case_chedinchina_police_avb_ts10034

Body:గమనిక:
వార్తకు సంబంధించిన మరొక ఫైల్ wrap ద్వారా పంపడమైనది. తీసుకోగలరు.

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య.

కుమురం భీం జిల్లా దహేగం మండలంలో నిన్న జరిగిన హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. కాగజ్ నగర్ పట్టణం డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను తెలియజేసారు డిఎస్పీ బి.ఎల్.ఎన్. స్వామి.

కుమురం భీం జిల్లా కౌటాల మండలానికి చెందిన రౌతు బండు (34) కు దహేగాం మండలం రాళ్లగూడా గ్రామానికి చెందిన కవితతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. బండు ఇల్లరికం అల్లుడుగా వచ్చి రాలగూడలోనే నివాసం ఉంటున్నాడు. వీరికి 7 సంవత్సరాల వయసు గల ఒక పాప ఉంది. కాగజ్ నగర్ మండలం బురద గూడ గ్రామానికి చెందిన కొత్రాంగి బిక్కుతో సంవత్సర కాలంగా అక్రమసంబందం నెరుపుతోంది. ఈ విషయమై భర్త రౌతు బండు.. భార్య కవితను తరచు నిలదిస్తూ ఉండేవాడు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని తలచిన భార్య కవిత ప్రియుడు బిక్కు తో కలిసి భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం ఆదివారం రాత్రి భర్త నిద్ర పోయాక ప్రియుడిని అర్ధరాత్రి ఇంటికి రమ్మని కబురు పెట్టింది భార్య. ప్రియుడు బిక్కు వచ్చి రౌతు బండు ను కర్ర తో బలంగా తలపై మోదడంతో బండు అక్కడిక్కడే మృతి చెందాడు. భర్త మృతదేహాన్ని అదే రాత్రి ప్రియుడి ద్విచక్రవాహనంపై కొత్మిర్ గ్రామ సమీపంలోని పత్తి చేనులో పడవేసి వెళ్లిపోయారు. ఉదయం ఏమి తెలియనట్టు మృతిని భార్య కవిత పొలం పనులు వెళ్ళిపోయింది.

కొత్మిర్ గ్రామ సమీపంలోని పత్తి చేనులో వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని చూసి గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుని సోదరుడు కొండయ్య ఇచ్చిన పిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేస్ నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు పోలీసులు. 24 గంటల్లో కేసును ఛేదించి నిందితులను రిమాండ్ కు పంపారు. హత్యకేసును చాకచక్యంగా ఛేదించిన కాగజ్ నగర్ గ్రామీణ సి.ఐ. అల్లం నరేందర్, దహేగం ఎస్.ఐ. విక్కుర్తి రఘుపతి, మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ, మల్లారెడ్డి, ఏఎస్పీ సుధీంద్ర, డిఎస్పీ స్వామి అభినందించారు.

బైట్:
కాగజ్ నగర్ డిఎస్పీ:
బి.ఎల్.ఎన్. స్వామి

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.