పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తెస్తున్న క్రమంలో అంబులెన్స్ మధ్యలో మొరాయించింది. ఇటు ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ లేవు. డ్రైవర్ అర్జున్ వాహనం పైకి ఎక్కి వైద్యులకు సమాచారం అందించడంతో మరో వాహనం వచ్చింది. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బాబేఝరి గ్రామానికి చెందిన ఆత్రం జ్యోతిబాయికి ఆదివారం పురిటినొప్పులు రావడంతో ఆశా కార్యకర్త రూపాబాయి కెరమెరి ఆసుపత్రి సిబ్బందికి సమచారం అందించింది. అంబులెన్స్‌లో జ్యోతిబాయిని తీసుకెళుతుండగా మార్గమధ్యలో వాహనం ముందుకు కదలకుండా మొరాయించింది. చరవాణి సిగ్నల్స్ లేవు. వాహనచోదకుడు కొద్ది దూరం అటు ఇటు తిరిగి చివరికి వాహనం పైకి ఎక్కగా కొద్దిగా స్నిగల్ అందాయి. ఇబ్బందుల మధ్యనే సమాచారం అందించడంతో 20 నిమిషాల అనంతరం మరో వాహనంలో ఆసుపత్రి సిబ్బంది వచ్చి గర్భిణిని కెరమెరి ఆసుపత్రికి తరలించారు.
థర్మాకోల్ పడవలపై.. నిండు గర్భిణి ప్రయాణం
ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన సోనికి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు నొప్పులు ప్రారంభయ్యాయి. తండ్రి నాగయ్య ఆసుపత్రికి తరలించడానికి బయలుదేరారు. మూడు కి.మీ.దూరంలో ఉన్న ఆసిఫాబాద్ ప్రధాన ఆసుపత్రికి రావాలంటే మధ్యలో గుండి వాగును దాటాలి. థర్మాకోల్‌తో చేసిన పడవపై ప్రమాదకరంగా సోనికి వాగును దాటించి, ఆసుపత్రికి తరలించారు. 15ఏళ్లుగా గుండి వంతెన ఆసంపూర్తిగానే ఉంది.
ఇదీ చూడండి: డోలీ కట్టి గర్భిణీ తరలింపు.. పుట్టిన కాసేపటికే మగబిడ్డ మృతి