కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని పలు దుకాణాల్లో టాస్క్‌పోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు. పట్టణంలోని రెండు కిరణా దుకాణాల్లో సుమారు 39,900 రూపాయల విలువగల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ గంగన్న తెలిపారు.
ఇవీ చూడండి: '18 బిలియన్ డాలర్లకు భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యం'