ETV Bharat / state

స్థానిక నేతల ఆగడాలు: 'డబ్బులిస్తారా... కుల బహిష్కరణ చేయమంటారా'

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కోమటికుంటలో చేటపట్టిన ఆస్తుల సర్వే వివాదాలకు దారి తీసింది. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గృహాలు నిర్మించుకున్నవారు పంచాయతీకి నగదు చెల్లించాలని ఉప సర్పంచ్​, ఇతర నేతలు డిమాండ్​ చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. లేకుంటే కులబహిష్కరణ చేస్తామని బెదిరిస్తున్నారంటూ కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

స్థానిక నేతల ఆగడాలు: 'డబ్బులిస్తారా... కుల బహిష్కరణ చేయమంటారా'
స్థానిక నేతల ఆగడాలు: 'డబ్బులిస్తారా... కుల బహిష్కరణ చేయమంటారా'
author img

By

Published : Dec 13, 2020, 1:31 PM IST

కుమురం భీం జిల్లా వాంకిడి మండలం కోమటిగూడలో ప్రభుత్వం చేపట్టిన ఆస్తుల సర్వే చిచ్చురేపింది. 30ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన కొందరు ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిలో గృహాలు నిర్మించుకున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం చేపట్టిన ఆస్తుల సర్వే సందర్భంగా వివాదాలు రేగాయి. స్థానిక ఉప సర్పంచ్ సోనేలే పురుషోత్తం సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఇచ్చిన స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నవారు పంచాయతీకి డబ్బులు కట్టాలని ఆదేశించారు.

సర్కారు ఇచ్చిన భూమిలో నుంచి ఒక గుంట మినహాయించి మిగిలిన స్థలానికి రూ.లక్షా పదివేలు పంచాయతీకి చెల్లించాలని డిమాండ్​ చేశారు. డబ్బు చెల్లించకుంటే కుల బహిష్కరణ చేస్తామన్నారు. అంత మొత్తం చెల్లించలేమని.. రూ.50 వేలు చెల్లించగలమని బాధితులు కోరినా వినలేదు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన 15 కుటుంబాలు వారు జిల్లా కలెక్టర్​, డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఎందుకీ తొందర: నిమిషం ఆగితే ఐదుగురి ప్రాణాలు నిలిచేవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.