ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా... ప్రజలు మాత్రం బయటికి రాకుండా ఉండలేకపోతున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో పోలీసులు పలు చౌరస్తాల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అనవసరంగా రహదారులపైకి వచ్చిన వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చే వారిని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. సాధారణ ప్రజలెవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. అత్యవసర విధుల్లో పాల్గొనే ఉద్యోగులు గుర్తింపుకార్డులు వెంట బెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి: లాక్‌డౌన్ ఒక్కటే సరిపోదు... ఇంకా చాలా చేయాలి