కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలంలో ఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. పెద్దబండ గ్రామంలో జరిపిన ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.12,000 విలువగల మద్యం, రూ.3000 విలువగల నిషేధిత గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. నలుగురిపై కేసు నమోదు చేశారు. గ్రామాల్లో అక్రమంగా మద్యం నిల్వ చేసినా, నకిలి పత్తి విత్తనాలు అమ్మి రైతులను మోసం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. బాల్యవివాహలను ప్రోత్సహించిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ తనిఖీల్లో కాగజ్ నగర్ డీఎస్పీ సాంబయ్య, సీఐ, ఎసైలు పాల్గొన్నారు.
సిర్పూర్ టి మండలంలో నిర్బంధ తనిఖీలు - sp mallareddy
నేర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తామని కుమురంభీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు.