కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు పాలనాధికారి కార్యాలయం ఎదుట జిల్లాలోని విద్యా వాలంటీర్లు మోకాళ్ళపై కూర్చుని విన్నూత్న నిరసన చేపట్టారు. విద్యా వాలంటీర్లకు 4 నెలల వేతన బకాయిలు తక్షణం చెల్లించే వరకు ధర్నాను విరమించేది లేదని పాలనాధికారి కార్యాలయం ముందు భీష్మించి కూర్చున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నందున సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యా వాలంటీర్లను కొనసాగించాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఉప పాలనాధికారి రాంబాబుకు వినతిపత్రం సమర్పించారు.