కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల పరిధిలోని సిర్సా గ్రామానికి చెందిన రాయమల్లుకు ఇద్దరు కూతుళ్లు. ఒక కూతురుని పోచం అనే వ్యక్తికి ఇచ్చాడు. మరో కూతురి కోసం ఈరేళ్లు ఐలయ్యను ఇల్లరికం తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఐలయ్య మామ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మామ రాయమల్లుకు చెందిన ఆస్తి పంపకాల్లో ఐలయ్యకు, పోచంకు మధ్య కొట్లాట జరిగింది. ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో ఐలయ్య కిందపడి తలకు తీవ్రమైన గాయం తగిలింది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలింస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. మృతుడి కొడుకులు బీరయ్య, శంకర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌటాల సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'యూ ఫర్ అగ్లీ' అని నేర్పిన టీచర్లు.. సస్పెండ్!