ETV Bharat / state

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి యువకుడు మృతి - komurama bheem asifabad

ఓ యువకుడిని పాము కాటేసింది..108కి ఫోన్ చేస్తే డ్రైవర్ లేదని సమాధానం. ఎలాగో అలా ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్ లేడు. వేరేచోటికి తీసుకెళ్దామంటే ప్రభుత్వ అంబులెన్స్​లో డీజిల్ లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడు.

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి యువకుడు మృతి
author img

By

Published : Jun 8, 2019, 3:20 PM IST

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి యువకుడు మృతి

కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ ప్రాణాన్ని బలితీసుకొంది. పాటిబండ గ్రామపంచాయతీ వద్ద వాగు కాలనీలో 22 ఏళ్ల శంకర్​కు పాము కాటేసింది. వెంటనే 108కి ఫోన్ చేస్తే డ్రైవర్​ లేడని చెప్పారు. సొంత వాహనంపై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడా డాక్టర్ లేడు. నర్సులు ప్రథమ చికిత్స అందించి.. మంచిర్యాలకు తీసుకువెళ్లమని సూచించారు. ప్రభుత్వ అంబులెన్సులో తరలించడానికి ప్రయత్నించగా.. డీజిల్​ లేదని డ్రైవర్​ తెలిపాడు. బాధితుని కుటుంబీకులే అంబులెన్స్​లో డీజిల్ కొట్టించి మంచిర్యాలకు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటనతో రహదారిపై మృతుడి కుటుంబీకులు, గ్రామస్థులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్న రోగాలకు కూడా.. మంచిర్యాలకు పంపిస్తున్నారని ఆరోపించారు. వెంటనే కొత్త వైద్యులను నియమించాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: అమ్మాయి కోసం స్నేహితుల గొడవ..ఆత్మహత్య..!

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం పాటిబండ గ్రామపంచాయతీ వట్టి వాగు కాలనీలో నిన్న 2 గంటల సమయంలో చేను లో లో మాత్రం శంకర్ 22 సంవత్సరాల వ్యక్తికి పాము కాటు వేయడంతో వెంటనే కుటుంబీకులు గ్రామస్తులు 108 కు చారవాని ద్వారా సమాచారం అందించగా డ్రైవర్ లేడు అని తెలుగు సమాధానం వారు చెప్పినట్లు పేర్కొన్నారు వెంటనే వారి సొంత వాహనం పై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు ప్రభుత్వాసుపత్రిలో డ్యూటీ డాక్టర్ ర్ లేకపోవడంతో రాత్రి డ్యూటీ లో ఉన్న నర్సులు ప్రథమ చికిత్స అందించి మంచిర్యాలకు తీసుకు వెళ్లాల్సిందిగా కుటుంబ సభ్యులకు తెలపగా ప్రభుత్వ ఆంబులెన్స్ లో డీజిల్ లేదని డ్రైవర్ పేర్కొన్నారు వెంటనే కుటుంబీకులు పదకొండు వందల రూపాయల డిజిల్ ప్రభుత్వం అంబులెన్స్లో పోయించి మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో బెల్లంపల్లి వద్ద మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న చిన్న రోగాలకు కూడా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారని వాపోయారు ఆత్రం శంకర్ పాముకాటుతో మృతిచెందడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టరు లేరన్న కారణంతో ఈరోజు ఉదయం అంతర్రాష్ట్ర రహదారి పై కుటుంబీకులు గ్రామస్తులు డాక్టర్లను వెంటనే నియమించాలని రాస్తారోకో ధర్నా నిర్వహించారు

Body:tg_adb_25_08_paamu_kaatutho_mruthi_avb_c10

Conclusion:1. బైట్ ఆసిఫాబాద్ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్
2. బైట్ ఆసిఫాబాద్ మండలం తుడుం దెబ్బ నాయకుడు కుటుంబ సభ్యుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.