కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో నామపత్రాల పరిశీలన కొనసాగుతోంది. పట్టణంలోని 30 వార్డులకు 186 నామినేషన్లు దాఖలయ్యాయి. తెరాస 69, కాంగ్రెస్ 51, భాజపా 36, ఎంఐఎం 3, సీపీఐ 1, స్వతంత్రులు 22 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఇవాళ అభ్యర్థుల సమక్షంలో నామపత్రాలు పరిశీలన చేపట్టారు. సంయుక్త పాలనాధికారి డాక్టర్ రాంబాబు నామపత్రాలు పరిశీలనను సమీక్షించారు. డీఎస్పీ స్వామి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: రెవెన్యూ, పోలీస్ అధికారులతో ఎస్హెచ్ఆర్సీ ఛైర్మన్ సమీక్ష